అభిషేకం.
ప్రతి బుధవారం ఉదయం శ్రీ వినాయక స్వామికి.. ప్రతి గురువారం శ్రీ సాయిబాబా స్వామికి దేవస్థానం వారు నిర్వహించే అభిషేకం లో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదములు పొందవచ్చు.. భక్తులు తమకు నచ్చిన రోజుల్లో స్వయముగా కుటుంబ సభ్యులతో కలిసి పూజారి గారితో ముందుగా సంప్రదించి అభిషేకం చేయించుకోవచ్చు.. అభిషేకమునకు రుసుము 100( నూరు) రూపాయలు ఆలయ పర్యవేక్షకుల వారికి చెల్లించి రసీదు పొందగలరు.. మిగతా పూజలకు రుసుము లేదు.
సంగీత, సాహిత్య ధార్మిక కార్యక్రమములు.
తరతరాలనుండి తాళ్లపాక గ్రామము సంగీత, సాహిత్య ధార్మిక కార్యక్రమాలకు ప్రసిద్ధి. గ్రామ నడిబొడ్డున వున్న ఈ పవిత్ర ఆవరణం లో సాయంత్రం పూట భజనలు, బృందగానాలు, పారాయణాలు, ప్రవచనాలు మొదలైన ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.. ఇందుకు కావలసిన మైకు సెట్టు, సంగీత వాయిద్యములు, భగవద్గీత, విష్ణు, లలితా సహస్ర నామ పుస్తకములు దాతల సహాయంతో ఆలయమునకు సమకూర్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.. గ్రామస్తులు ఈ సదుపాయాలను ఆలయ పవిత్రతను, పరిశుభ్రతను కాపాడుతూ వినియోగించుకోవచ్చును..
వాహన పూజ.
అన్ని శ్రీ వినాయక ఆలయాల్లో వాహన పూజలు చేసినట్టు ఈ ఆలయం ముంగిటిలో కొత్తగా కొనుగోలు చేసిన వాహనములకు విశేష పూజ చేయించుకునే సదుపాయం వుంది.
* బైక్ లు
* స్కూటీలు
* కార్లు
* ట్రాక్టర్లు
మొదలైన అన్ని వాహనములకు విఘ్నములు కలగకుండా శ్రీ గణేశుని పూజ పూజారి గారితో చేయించు కోవచ్చును..ప్రస్తుతానికి దేవస్థానమునకు ఎటువంటి రుసుము చెల్లించ నవసరం లేదు